సినిమా సినిమాకు రాజమౌళి తన కీర్తి పెంచుకుంటూ పోతున్నాడు మరీ. బాహుబలి చిత్రాలతో దేశాన్ని ఆకర్షించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో అంతర్జాతీయ గుర్తింపు ఆర్జిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ సినిమా వేదికపై సత్తా చాటుతుంది మరీ. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్  ను కుడా గెలుపొందిన ఆర్ ఆర్ ఆర్, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్స్ కి నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్  కూడా అయ్యింది ఈ సినిమా, గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిస్తే రాజమౌళి ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఆస్కార్ గెలుచుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.


ఈ క్రమంలో మహేష్ మూవీ ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటా రాజమౌళి. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని ఇప్పటికే రాజమౌళి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. కథ, జోనర్ పై కూడా అవగాహన కలిగించారు. మహేష్ కి యాక్షన్ అడ్వెంచర్ కథ సెట్ అవుతుందని నమ్మిన రాజమౌళి తనతో ఆ తరహా స్క్రిప్ట్ సిద్ధం చేయించారని వెల్లడించారు. ఎప్పటి నుండో మహేష్ కోసం అనుకుంటున్న కథకు మెరుగులు దిద్ది సరికొత్తగా సిద్ధం చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ ఓ హింట్ కూడా మనకు ఇచ్చారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం రాజమౌళి 5 ఏళ్ల సమయం కేటాయించారు. దీంతో మహేష్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు రాజమౌళి గారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా నడుస్తున్నాయి. సాంకేతిక నిపుణులు, క్యాస్టింగ్ స్టార్ట్ చేశారు. 2023 మే లేదా జూన్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ కావచ్చని విజయేంద్ర ప్రసాద్ మీడియా కు వెల్లడించారు. పాన్ వరల్డ్ చిత్రానికి అదే స్థాయిలో క్యాస్టింగ్ ని సిద్ధం చేస్తున్నారు. మహేష్ తండ్రిగా సీనియర్ స్టార్ హీరో నటిస్తున్నట్లు క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది.కథలో హీరో తండ్రి పాత్రకు గొప్ప నేపథ్యం ఉంటుందట. చాలా కీలకమైన ఈ పాత్ర బాగా పేరున్న స్టార్ యాక్టర్ చేస్తేనే సినిమాకు  బాగా ప్లస్ అవుతుందని నమ్మిన రాజమౌళి ఏకంగా అమితాబ్ ని లైన్లోకి తెచ్చారట మరీ,p. మహేష్ తండ్రి పాత్ర కోసం అమితాబ్ ని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట ఈ సినిమా కు. రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ కి అమితాబ్ సైన్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో సైతం అమితాబ్ కీలక  రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: