మాస్ మహారాజాగా లక్షలాది అభిమానులను పొందిన రవితేజా ఒకప్పుడు ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో. అతడితో సినిమాలు తీసే నిర్మాతలకు పెద్దగా నష్టాలు వచ్చేవి కావు. టాప్ యంగ్ హీరోల హవా పెరిగి పోవడంతో రవితేజా మ్యానియా నెమ్మదిగా తగ్గి అతడి సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే అనూహ్యంగా ‘క్రాక్’ మూవీ సూపర్ సక్సస్ కావడంతో అతడి మార్కెట్ మళ్ళీ పెరిగింది.


కానీ గతకొంత కాలంగా అతడి సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో క్రిస్మస్ రేస్ కు రాబోతున్న ‘థమాక’ మూవీ పై మాస్ మహారాజా చాల ఆశలు పెట్టుకున్నాడు. దీనికితోడు ఈమూవీలో ప్రస్తుత తరం యూత్ లో విపరీతమైన క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల నటిస్తూ ఉండటంతో ఈమూవీకి యూత్ బాగా వస్తారని అంచనాలు వస్తున్నాయి.


ప్రస్తుతం రవితేజాకు 55 సంవత్సరాలు ఉన్నప్పటికీ తాను ఇంకా యంగ్ హీరోని అని చెప్పడానికి హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ చేసే విషయంలో ఎటువంటి వెనకడుగు వేయడంలేదు. దీనికితోడు యంగ్ హీరోలతో సమానంగా లిప్ లాక్ సీన్స్ తో కూడ నటిస్తున్నాడు. డింపుల్ హైతీ మీనాక్షి చౌదరీ దివ్యాంశ కౌషిక్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో రవితేజా తన గత సినిమాలలో లిప్ లాక్ సీన్స్ లో నటించాడు. అయితే అలాంటి లిప్ లాక్ సన్నివేశాలు వెండితెర పై రాగానే ప్రేక్షకులు నవ్వుకోవడం రవితేజా దృష్టి వరకు వచ్చినట్లు ఉంది. అందుకే ‘థమాక’ మూవీలో శ్రీలీల తో లిప్ లాక్ సీన్స్ వద్దు అని చెప్పాడట.


ఈమూవీ దర్శకుడు నక్కిన త్రినాథరావు హీరోయిన్స్ ను చాల గ్లామర్ గా చూపించడంలో సిద్ధ హస్తుడు. ఈనేపధ్యంలో ఒక డీప్ లిప్ లాక్ సీన్ శ్రీలీల రవితేజాల మధ్య దర్శకుడు క్రియేట్ చేసినప్పటికీ దానికి మాస్ మహారాజ వెంటనే నో చెప్పాడు అని అంటారు. అంతేకాదు ఇక నుంచి తన సినిమాలలో తాను లిప్ లాక్ సీన్స్ లో నటించను అని స్పష్టంగా చెప్పినట్లు టాక్..




మరింత సమాచారం తెలుసుకోండి: