
ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకులు ఈ సినిమా నుంచి ఈ పాటను తొలగిస్తారా లేక అలాగే ఉంచుతారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మరోపక్క మేకర్ సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత షారుఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమా విడుదల అవబోతోంది భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సంక్రాంతికి పలు సినిమాలు విడుదలైన తర్వాత ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి షారుఖ్ ఖాన్ సౌత్ ఇండియాలో సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేశాడు.
సినిమా ప్రమోషన్స్ కోసం షారుఖ్ ఖాన్ తో పాటు జాన్ అబ్రహం అలాగే దీపిక పదుకొనే హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తమిళనాడు , కర్ణాటక తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టనున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా విజయాన్ని సాధిస్తుంది.. ఉన్న అడ్డంకులను తప్పించుకుంటుందా.. లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా విడుదల అవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.