ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ డాన్స్ కొరియో గ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి శేఖర్ మాస్టర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు ప్రతి స్టార్ హీరో సినిమాకు కూడా పని చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ లోని సుగుణ సుందరి అనే సాంగ్ కి కొరియో గ్రఫీ చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఈ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ "సుగుణ సుందరి" సాంగ్ గురించి మాట్లాడుతూ ... ఈ సాంగ్ చిత్రీకరణను టర్కీ లో చేసినట్లు చెప్పు కొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ లో బాలకృష్ణ మరియు శృతి హాసన్ వేసిన స్టెప్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. వీర సింహా రెడ్డి మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక గా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: