తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విజయ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ మూవీలలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. 

అలాగే విజయ్ తాను నటించిన మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి కొన్ని విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దళపతి విజయ్ ప్రస్తుతం వారీసు అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు . 

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తలకెక్కబోయే భారీ బడ్జెట్ క్రేజీ మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో దర్శకుడు మరియు నటుడు అయినటువంటి గౌతమ్ మీనన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతమ్ మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. ఈ మూవీ లో సంజయ్ దత్ ... అర్జున్ ... త్రిష మరియు తదితరులు ముఖ్య పాత్రలలో నటించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని అధికారికంగా ప్రారంభించారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు అద్భుతమైన రీతిలో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: