తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించి మంచి టాక్ ను అందుకుంది.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఈ మధ్య తెలుగులో అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు.. దాంతో బాలివుడ్ లో సినిమాలు చేస్తుంది.. హిందీ, తమిళ్ చిత్రాల్లొ నటిస్తుంది..ప్రస్తుతం ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. బాలివుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది..


 ఈమె పెళ్ళి పై ఎన్నో వార్తలు వినిపించాయి. ఓ వ్యాపారవేత్త ను పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ హాట్టాపిక్గా మారింది. అయితే ఈ సారి పెళ్లి కాదు కానీ డేటింగ్లో ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఎమ్‌సీఎ' నటుడు విజయ్ వర్మతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ.. న్యూ ఇయర్ వేడుకల్ని అతడితో కలిసి గోవాలో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తమన్నా, విజయ్ వర్మ సన్నిహితంగా కనిపించారు..


వీరిద్దరికి సంబందించిన వీడియో ల్లో ముద్దులు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఇకపోతే వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ -2 లో జంటగా నటిస్తున్నారు. 2018లో నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన లస్ట్ స్టోరీస్‌కు కొనసాగింపు గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు టాక్. ఇకపోతే గత కొద్ది రోజులుగా తమన్నా, విజయ్ వర్మ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. వీరిద్దరి మధ్య నిజంగా అది ఉందా లేదా అన్నది తెలియాల్సి వుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: