నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది . అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దునియా విజయ్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో ... వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించింది . ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటివరకు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఈ సినిమా నుండి మాస్ మొగుడు అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు . 

ఈ సాంగ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది . ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించ బోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది . ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: