
శౌరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా బుట్ట బొమ్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇకపోతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే అర్జున్ దాస్ డెడికేషన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
తమిలియన్ అయిన అర్జున్ దాస్ తెలుగులో బుట్ట బొమ్మ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏంటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా.. సొంతంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడమే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి సినిమాతోనే ఆయన తెలుగు నేర్చుకొని మరీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం నిజంగా హాట్సాఫ్ అంటున్నారు అభిమానులు. బేస్ వాయిస్ తెచ్చుకున్న ఈ నటుడు తెలుగు నేర్చుకొని తొలిసారిగా తెలుగులో డబ్ చేశాడు.. ఈ విషయం తెలిసి అర్జున్ దాస్ డెడికేషన్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.