డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇలా ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , సంజయ్ దత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారం నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది .

ఈ షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం . ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మారుతి అతి తక్కువ రోజుల్లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: