బుల్లితెరపై వచ్చే షోలలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోహిణి .బుల్లితెరపై రోహిణి హవా ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రతి షోలో నవ్వుల పూయిస్తూ ఉంటుంది ఈమె. ప్రస్తుతం రోహిణి వరుస ఈవెంట్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం రోహిణి జబర్దస్త్ కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ఒక ప్రోమో ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ ఎపిసోడ్ కి బుట్ట బొమ్మ చిత్రం యూనిట్ రావడం జరిగింది. 

అయితే హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాలో ఒక విలన్ గా  చేసిన అర్జున్ దాస్ కూడా బుడ్డ బొమ్మ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రోమో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ షోలో ఎప్పటిలాగే అందరి ఆటపాటలు, డాన్స్ ,షోలో సాంగ్స్ పాడే ఆర్టిస్టులతో ఈ ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. ఇందులో భాగంగానే  రాంప్రసాద్, నరేష్ ,బుల్లెట్ భాస్కర్ రోహిణిల కామెడీ అందర్నీ తెగాకట్టుకుంటుంది. ఇక రోహిణి ఈ  షోలో భాగంగా  భీమ్లా నాయక్ సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది.అయితే ఈ షో లో  భాగంగా కుర్చీలాటని కూడా పెట్టడం జరిగింది.

ఇక ఆ కుర్చీలాటలో భాగంగా సీరియల్ హీరోయిన్ నవ్య స్వామిని అర్జున్ దాస్ ఎత్తుకుంటాడు. ఇక అంతలోనే మధ్యలోకి దూరిన రాంప్రసాద్ రోహిణి పిలిచి ఆమెను పిలుస్తారు.. ఇక ఆమెని  చూడగానే కాస్త భయపడుతున్నట్టు ఫేస్ అమాయకంగా పెట్టాడు హీరో అర్జున్ దాస్.. భయపడుతున్నప్పటికీ రోహిణిని ఎత్తుకొని కుర్చీలచెట్టు తిరుగుతూ ఉంటాడు అర్జున్.. దీంతో ఈ ప్రోమోలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇందులో భాగంగానే రోహిణి అర్జున్దాస్ చేయిని రొమాంటిక్గా పట్టుకుని ఆయన ప్రేమని అంగీకరించినట్లు ఉంటుంది.అనంతరం అర్జున్ దాస్ రోహిణికి దండం పెడతాడు.. దాంతో ఒక్కసారి అందరూ నవ్వుకుంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: