తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మైత్రి సంస్థ నిర్మించిన ఎమిగోస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఆశికా రంగనాథ్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఇలా కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి రెండవ సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది. 

మూవీ నుండి ఎన్నో రాత్రులొస్తాయి అనే పాటను జనవరి 29 వ తేదీన సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇప్పటికే బింబిసారా మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ "ఏమిగొస్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: