టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం 'పుష్ప 2'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వరుస లీకులు బయటికి వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుండే సినిమా నుంచి చిన్న చిన్న లీకులు మొదలయ్యాయి. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పుష్ప టు షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే వైజాగ్ ఎపిసోడ్ షూట్ కి సంబంధించి మూవీ సెట్స్ లో అల్లు అర్జున్ చైర్ లో కూర్చుని ఉన్న ఫోటో అలాగే మరికొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. 

ఇప్పటివరకు పుష్ప 2 నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ లీక్ ఫోటోలు వీడియోలతో  ఖుషి అవుతు వీటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే గతంలో పుష్ప పార్ట్ 1 కి సంబంధించి కూడా ఇటువంటి లీక్ లే వచ్చాయి. అప్పుడైతే ఏకంగా సినిమా నుండి ఓ ఫైట్ ఎపిసోడ్, సాంగ్ విజువల్స్ కూడా లీకై సంచలనం సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు పుష్ప 2 కి కూడా వరస లీకులు బయటికి వస్తున్నాయి. దీంతో మేకర్స్ కి ఈ లీకుల బెడద పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ సినిమా నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లీకుల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాకి లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా పుష్ప టు నుండి మరో పిక్ లీక్ అయి బయటికి వచ్చింది.

ఇందులో బన్నీ పుష్పరాజ్ గెటప్ లో ఒక కారు ముందు నిలబడి పైకి చూస్తున్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో లీకైన ఈ పిక్ తెగ వైరల్ గా మారుతుంది. మరి ఇప్పటికైనా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇంకా కాస్త కేర్ తీసుకొని షూటింగ్లో ఎటువంటి లీకులు జరగకుండా చూసుకోవడానికి స్పెషల్ టీం పెట్టుకుంటే మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తోపాటు మరి కొంతమంది నటీ నటులు కూడా నటిస్తున్నారు. వారిలో విజయసేతుపతి, జగపతిబాబు, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని ఈ ఏడాది చివరికి లేదా 2024 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: