
ఈసారి అలా ఎన్నిసార్లు మందలించిన, మరొకవైపు జరగాల్సిన నష్టం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. కొంతమంది నేతలు ఆవేశంలో ఆగ్రహంతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి కొంతమంది తమ అసంతృప్తిని తెలియజేస్తూ అసెంబ్లీ వేదికగానే మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడిన నేతల వెనకాల మాటలకు అర్థాన్ని కూడా పసిగట్ట గలరు చంద్రబాబు. అలాంటి వారిని చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నేతలలో మార్పు రాకపోవడమే కాకుండా మరి కొంతమంది వారిని చూసి తయారవుతున్నట్లు పార్టీలో భావన ఏర్పడుతోంది.
వైసీపీలో కూడా జరిగింది ఇదే అంటూ గుర్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. తప్పులు మీద తప్పులు చేస్తూ ఉంటే జనం సహించారని.. వైసిపి పార్టీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎన్నో అమలు చేసిన చివరికి ఫలితం తేడా కొట్టింది.. ప్రజలు పార్టీ ప్రభుత్వాన్ని కలిపి చూస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడు టిడిపి పార్టీలో కూడా ఇలాంటి తప్పులే జరుగుతున్నాయి.. దీనివల్ల వైసిపి పార్టీకి అవకాశం ఇచ్చిన వారం అవుతాం అంటూ నేతలను హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదనే విధంగా వినిపిస్తున్నాయి.
అయితే వారు ఇలా మాట్లాడడానికి ముఖ్య కారణం టిడిపిలో స్వేచ్ఛ ఎక్కువైందని గతంలో భయం ఉండేది కానీ ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా తమ దారి తమదే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో సీటు విషయం పక్కనపెట్టి.. ఇప్పుడు ఉన్న ఐదేళ్ల లోపు తమ అనుకున్న పనులను చేసుకుంటూ వెళ్తున్నారు..వాస్తవానికి ఈ వయసులో కూడా చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పు కోసం చాలానే కష్టపడుతున్నారు.. ఒకే ప్రభుత్వం కొన్నేళ్లపాటు అధికారంలో ఉంటే కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని భావనతో చంద్రబాబు కష్టపడుతున్న కొంతమంది నేతలు మాత్రం కూటమిలో అలా చేయడం లేదనే విధంగా వినిపిస్తున్నాయి. కొంతమంది క్రమశిక్షణ కట్టు తప్పి మరి వ్యవహరిస్తున్నారు. వీటివల్ల కూటమిలో చాలా ఇబ్బందుల తలెత్తేలా కనిపిస్తున్నాయి.