
స్టేజ్‌పైకి వచ్చిన ఎన్టీఆర్ సరిగ్గా నిలబడలేకపోయినా, మాట్లాడటంలో కాస్త ఇబ్బంది ఉన్నా, తన స్పెషల్ అపియరెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, ఆయనను చూసిన అభిమానులు సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో రచ్చ చేశారు. కానీ అలాంటి అప్‌డేట్ ఏదీ ఎన్టీఆర్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ దశలోనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జోడీగా రుక్మిణి వసంత్ నే నటిస్తుండటం మరో హైలైట్‌గా మారింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ఎన్టీఆర్ లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆయన గడ్డాలు, మీసాలు, ఫిట్‌నెస్ లెవెల్స్ వేరే స్థాయిలో ఉన్నాయని ఫ్యాన్స్ ప్రశంసించారు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ను మరో ప్రపంచానికి తీసుకెళ్తాడని ప్రశాంత్ నీల్‌పై ఆశలు పెట్టుకున్నారు. కాంతార రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన వాళ్లు కూడా, కాంతార గురించి కాకుండా ఎన్టీఆర్ కొత్త సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం విశేషం. లీన్ బాడీతో తారక్, కొత్త గడ్డం లుక్ తో దర్శనమివ్వడం ఫ్యాన్స్‌కి పెద్ద హైలైట్‌గా మారింది. దీంతో తారక్ లుక్‌పై మరింత క్లారిటీ ఫ్యాన్స్‌కు వచ్చేసినట్లే అనిపిస్తోంది. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఆ గుడ్ న్యూస్ ప్రశాంత్ నీల్ ఎప్పుడు బయటపెడతాడో..???