నిహారిక మెగా డాటర్. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, హీరోయిన్గా కొనసాగాలని అనుకుంది. కానీ అటు ఇటు కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా సెటిల్ అయిపోయింది. ఎప్పుడూ చూసినా నిహారిక అందంగా, చక్కగా, గ్లామరస్‌గా కనిపిస్తుంది. నిహారికలో హీరోయిన్‌ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్నా, ఆమె హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడానికి “మెగా డాటర్” అనే ట్యాగ్ కూడా కారణమని కొంతమంది అంటుంటారు. “మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మనం హీరోయిన్గా చూడలేం” అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు.


ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయిన నిహారిక, హీరోయిన్‌గా మాత్రం ఎందుకు సక్సెస్ కాలేదంటే—ఆమె నటించిన సినిమాలు ఒక్కటీ హిట్ కాకపోవడమే ప్రధాన కారణం. దీంతో మెగా డాటర్ నిహారిక హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్‌గా మారింది.ఇది పక్కన పెడితే, నిహారిక ఎప్పుడూ స్లిమ్‌గా ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో ఉంటుంది. “నేను అన్ని రకాల ఫుడ్స్ తింటాను” అని చెబుతున్నా, ఇంత సన్నగా, నాజూగా ఎలా ఉంటుందో అనేది జనాలకు డౌట్. ఇటీవలే నిహారిక తన డైట్ సీక్రెట్‌ను బయటపెట్టింది. “నేను రెగ్యులర్‌గా డైట్‌లో ఉండను, కానీ ఇప్పుడు మాత్రం కఠినమైన డైట్‌లో ఉన్నాను” అని చెప్పి షాక్ ఇచ్చింది.



ఆమె ఫాలో అవుతున్న డైట్ ఇదే:

“నాకు కావాల్సినవి అన్నీ తింటాను. కానీ నేను తినేది గుట్టు—చికెన్ డైట్, బిర్యానీ మాత్రమే. నా భోజనంలో రకాలు ఉండవు. ప్రస్తుతం నేను ఫుల్ కఠినమైన డైట్‌లో ఉన్నాను. రెగ్యులర్‌గా ఒకే తరహా ఆహారం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బ్లూబెర్రీ-బనానా స్మూతీనే ఎక్కువగా తాగుతాను. దానికి తగ్గట్టే వ్యాయామాలు కూడా చేస్తాను.” “కొన్నాళ్ల క్రితం నేను బరువు పెరిగాను. వ్యాయామం చేయడానికి సమయం దొరకలేదు. కానీ ఇప్పుడు లైఫ్‌ని మేనేజ్ చేసుకుంటూ ప్రతిరోజూ జిమ్‌కి వెళ్తున్నాను. జిమ్ ఇప్పుడు నా జీవన విధానంలో భాగమైపోయింది. అది ఇకపై ప్రతిరోజూ కొనసాగుతుంది. సినిమాలోకి వస్తున్నాను, నటిస్తున్నాను కాబట్టి బరువు తగ్గాలి అనుకోవడం లేదు. నా లైఫ్‌స్టైల్‌లో కొన్నికొన్ని మార్పులు రావాలని అనిపించింది. అందుకే ఈ డైట్, వ్యాయామం నా జీవితంలో భాగమయ్యాయి. చాలామంది నేను సన్నబడిన తర్వాత జిమ్ ఆపేస్తానని అనుకుంటున్నారు. కానీ ఇది అలవాటుగా మారిపోయింది. లైఫ్‌లో హ్యాపీగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. డైట్ మాత్రం రాబోయే రోజుల్లో మార్చేస్తాను” అంటూ నిహారిక తన స్లిమ్ లుక్ వెనక ఉన్న టిప్స్‌ను బయటపెట్టింది.


దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: