గత పది సంవత్సరాలుగా తిరుగులేకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోని మల్లెమాల సంస్థ 2013లో ప్రారంభించింది.అప్పటినుండి ఈ షో కి రోజా నాగబాబు జడ్జిలుగా మరియు అనసూయ యాంకర్ గా వ్యవహరించారు.మొదట ఈ షోలో రూలర్ రఘు, చలాకి చంటి ,చమ్మక్ చంద్ర, ధనా ధన్ ధన్రాజ్ ,పిల్లో వేణు ,రాకెట్ రాఘవ, షకలక శంకర్ టీం లీడర్స్ గా ఉండేవారు. ఎవరు ఊహించని విధంగా ఈ షో అప్పట్లో సక్సెస్ను అందుకుంది. పలు కారణాలవల్ల మొదటి నుండి ఉన్న కమెడియన్సు నుండి తప్పుకున్నారు. 

దీంతో మరింత టాలెంట్ ఉన్న చాలా మంది కమెడియన్స్ ఈ షో కి వచ్చారు. సుడిగాలి సుధీర్ హైపర్ ఆది టీమ్స్ జబర్దస్త్ షో కి మరింత ప్లస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కి విపరీతమైన ఆదరణ లభించడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ అని మరోసారి కూడా ప్రారంభించడం జరిగింది. గురువారం శుక్రవారం ప్రసారమయ్యే ఈ రెండు షోలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈ షో తో రష్మి మరియు అనసూయ దశతిరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేకాదు జబర్దస్త్ కి కమెడియన్లుగా వచ్చిన పలువురు కమెడియన్స్ ఈ షో తో నటులుగా కూడా సెటిల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అందరూ జబర్దస్త్ ని వీడియో వెళ్లిపోవడంతో మెల్లగా జబర్దస్త్ ప్రభావం తగ్గుతూ వచ్చింది.

మొదట ఈ షో నుండి నాగబాబు తప్పుకున్నాడు. జడ్జిలుగా రోజా మరియు నాగబాబు వెళ్లిపోవడం ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ హైపర్ ఆది సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్లిపోవడంతో ఈ షో రేటింగ్ అమాంతం తగ్గిపోయింది. మంచి మంచి కాంబినేషన్ తో కూడిన టీం లీడర్స్ వెళ్లిపోవడం జరిగింది. ఎవరు వెళ్లిపోయినప్పటికీ షో నడవాలి కాబట్టి కొత్త వాళ్లతో ఈ షోను నడుపుతున్నారు. కానీ కొత్త వారి వల్ల ఈ షో ప్రభావం అంతగా పెరగలేదు. అయితే తాజాగా జబర్దస్త్ షో గురించి సీనియర్ కమెడియన్ అదిరే అభి కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది.. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ఒకప్పటి వైభవాన్ని తలుచుకుంటూ ప్రస్తుత జబర్దస్త్ షోలో ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఎందరికో అన్నం పెట్టిన అమ్మ మల్లెమాల అంటూ ఎమోషనల్ అయ్యాడు అదిరే అభి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: