ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కూడా వరుస పెట్టి పెళ్లిలు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నితిన్‌, రానా ఇంకా నిఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలంతా పెళ్లి చేసుకోని ఓ ఇంటివాళ్లయ్యారు. ఇక మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌లో ఉన్న శర్వానంద్‌ కూడా ఇప్పుడు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరుపుకొని అతి త్వరలోనే పెళ్లి చేసుకోని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా మెగా హీరోలు అయిన సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌లపై పడింది. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్‌ పెళ్లి కోసం అయితే మెగా ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులకి చక్కటి శుభవార్తను చెప్పాడు మెగా బ్రదర్‌ నాగబాబు. అతి త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఉంటుందని, ఇక ఈ విషయాన్ని వరుణ్‌ అధికారికంగా ప్రకటిస్తామని ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే అమ్మాయి ఎవరనే విషయం మాత్రం ఇంకా ఆయన వెల్లడించలేదు.


ఇక పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఆ విషయాలన్ని వరుణ్‌ తేజ్‌ వెల్లడిస్తాడని నాగబాబు తెలిపాడు. ఇంకా అంతేకాదు పెళ్లి తర్వాత వరుణ్‌ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో కూడా ఉంటాడని, తాను తన భార్యతో కలిసి మరో ఇంట్లో ఉంటామని నాగబాబు చెప్పారు.ఇక పోతే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాటితో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య కొన్ని అబద్ధపు పుకార్లు వచ్చాయి. అలాగే ఓ వ్యాపారవేత్త కూతురిని వరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా బాగా వినిపించాయి. కానీ ఇలాంటి పుకార్లపై నాగబాబు స్పందించలేదు. వరుణ్‌ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తండ్రి నాగబాబు సమర్పణలో ఎస్‌వీసీసీ పతాకంపై బాపినీడు ఇంకా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.లాస్ట్ టైం వరుణ్ 'గని' సినిమాతో వచ్చి ప్లాప్ ని చవిచూశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: