సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు అనేక వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండరీ
డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ హఠాన్మరణం నుంచి ఇంకా కోలుకోకముందే సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సీనియర్ సింగర్ వాణీ జయరామ్(78) శనివారం నాడు మధ్యాహ్నం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తన తుదిశ్వాస విడిచారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా
కేంద్ర ప్రభుత్వం ఈమధ్య ఈ గాయనికి పద్మభూషణ్ అవార్డు పురస్కారం ప్రకటించింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని కోలుకోలేని షాక్ కు గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తమిళనాడులోని వేలూరులో పుట్టిన వాణీ జయరాం తెలుగు ఇంకా తమిళం భాషల్లో ఏకంగా 20 వేలకు పైగా పాటలు పాడారు. 1000 పాటలకు పైగా
ప్లే బ్యాక్ సింగర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా భక్తిగీతాలకు అయితే ఆమె పెట్టింది పేరు. ఇలా సుమారు మొత్తం 19 భాషాల్లో తన సుమధుర గానంతో అలరించిన ఈ ఈమెను ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం వరించింది. అయితే ఈ అవార్డు అందుకోకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచిపోయారు.
వెయ్యికి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు, ఇదీ వాణీ జయరాంగారు సొంతం చేసుకున్న తిరుగులేని రికార్డు. కేవలం ఆమె
మూవీ సాంగ్సే కాదు, వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు వాణీ జయరాం. 1971లో తన
సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా తన గానాన్ని కొనసాగిస్తున్నారు.ఇక తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాలం, ఒరియా, హిందీతోపాటు మొత్తం 19 భాషల్లో పాటలు పాడిన ఘనత సింగర్ వాణీ జయరామ్‌ది.ఇక తెలుగులో
మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ, ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ, ఆనతినీయరా.. లాంటి ఎన్నో మధురమైన పాటలతో తన ముద్ర వేసుకున్నారు వాణీ జయరాం. తెలుగులో ఆమె పాడింది తక్కువ పాటలే అయినా కానీ తెలుగు పాటలతోనే ఏకంగా రెండుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు వాణి. ఇక
తమిళ్ మూవీ అపూర్వ రాగంగళ్‌తో మొదటిసారి నేషనల్ అవార్డుకి ఎంపికైన వాణి, ఇంకా ఆ తర్వాత తెలుగు లైన శంకరాభరణం అలాగే స్వాతికిరణంతో ఏకంగా రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు.