మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మిల్క్ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి వేదాలం మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ పోస్టు లో ఈ మూవీ యూనిట్ భోళా శంకర్ మూవీ సెట్ నుండి ఒక అద్భుతమైన చిత్రం. లెజెండరీ రాఘవేంద్రరావు గారు ఈ మూవీ సెట్స్ సందర్శించి టీ మొత్తానికి ఆశీస్సులను ... శుభాకాంక్షలు తెలియజేశారు. రాఘవేంద్రరావు ... మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కినటు వంటి చూడాలని ఉంది సినిమా లోని రామ్మా చిలకమ్మా పాట సెట్ ను చాలా కాలం క్రితం సందర్శించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 

ఇప్పుడు రాఘవేంద్రరావు "భోళా శంకర్" మూవీ సెట్ ను సందర్శించారు. అంటూ ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి , దర్శకేంద్రుడికే రాఘవేంద్రరావు , మెహర్ రమేష్ , కీర్తి సురేష్ , వెన్నెల కిషోర్ , శేఖర్ మాస్టర్ , సురేఖ వాణి మరియు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: