అందాల తార సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందం అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది ఈమె. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అందాల తారగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది .ఇప్పటికే సౌందర్యం మధ్య లేదు అంటే చాలామంది జీర్ణించుకోలేరు. సౌందర్య మన మధ్య లేనప్పటికీ తన సినిమాలతో ఎప్పుడూ మన ముందే ఉంటుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకుని ఆమె అభిమానులు ఎందరో కన్నీరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇక సౌందర్య చనిపోయిన సమయంలో తన తల్లి ఎంతగా కన్నీరు పెట్టుకుందో మనందరికీ తెలిసిందే. 

తన కుటుంబ సభ్యులతోపాటు సౌందర్యని ఆదరించే ఎందరో తన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక అప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ చాలామంది చూస్తూనే ఉంటారు. ఇక తెలుగు కన్నడ హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సౌందర్య.ఈ నేపథ్యంలో సౌందర్య తన ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు. 2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయనే చెప్పారట. ఇక జాతకాలు నమ్మని సౌందర్య ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

ఇక ఆ సమయంలో సౌందర్య మాట్లాడుతూ.. నేను అలాంటి వాటిని నమ్మను.. నాకు 50 ఏళ్లు వచ్చే వరకు నేను సినిమాలలో నటిస్తాను.. నా వయసుకు తగ్గు పాత్రలు చేస్తాను.. ఇండస్ట్రీ నుంచి నేను ఎప్పుడు బయటకు రాను.. అంటూ తెగేసి చెప్పింది సౌందర్య. ఇక విధి ఆడిన వింత నాటకంలో అర్ధాంతరంగా కన్నుమూస్తుంది సౌందర్య. తన 50 ఏళ్ల వరకు నటిస్తానన్న కోరిక తీరకుండానే చనిపోయింది సౌందర్య. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అంతేకాదు ఈ వార్త తెలుసుకున్న సౌందర్య అభిమానులు ఈ వార్త చదివి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కొందరైతే కన్నీరు సైతం పెట్టుకుంటున్నారు...!!.

మరింత సమాచారం తెలుసుకోండి: