ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల లాగా గ్లామర్ షోలుఎక్స్పోజింగ్ లు చేయకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ మంచి పాత్రలను పోషిస్తూ సహజ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది సాయి పల్లవి .మొదటి సినిమా తోనే హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది .ఆ సినిమాలో తెలంగాణ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పి అందరి నోటా మంచి ప్రశంసలను అందుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నాచురల్ హీరోయిన్గా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది గత సంవత్సరం లవ్ స్టోరీ, శ్యామ్ సింగర్ వంటి సినిమాలలో నటించింది ఈమె. నటించిన రెండు సినిమాలు కూడా పెద్దగా పెట్టు కాలేదు..సినిమా పెద్దగా హిట్ కాక పోయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. 

అయితే సాయి పల్లవి రానా దగ్గుబాటి తో కలిసి నటించిన విరాటపర్వం సినిమా సైతం ఎంతటి విమర్శలను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కానప్పటికీ సాయి పల్లవి నటనకి మాత్రం అందరూ ఫిదా అయ్యారు అని చెప్పాలి. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు దాని అనంతరం సాయి పల్లవి ప్రధానోపాత్రలో వచ్చిన గార్గి సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే తను నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాపులు అయిన నేపథ్యంలో మరొక సినిమా చేయడానికి ఇప్పటిదాకా సైన్ చేయలేదు సాయి పల్లవి. అయితే తాజాగా ఎందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక సినిమా చేయడానికి కమిట్ అయిందట సాయి పల్లవి. మలయాళ హీరో నివీన్ పౌలితో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సాయి పల్లవి.

నవీన్ మరియు సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమా మలయాళం లో ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.నవీన్ చేసిన జార్జ్ పాత్రను సాయి పల్లవి చేసిన పాత్రను ఎప్పటికీ మర్చిపోలేరు.తాజాగా వీళ్ళిద్దరూ తారం అని మరో సినిమా చేయబోతున్నారు. వివేకరంజిత్ స్క్రిప్ట్ రాసిన ఈ సినిమాని వినయ్ గోవింద్ డైరెక్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది .మనాలి బాక్రోప్ లో ఈ సినిమా వస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సాయి పల్లవి తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది. ఇటీవల అజిత్ తో తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: