అతిలోక సుందరి అందాల తార పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి భారతదేశ చలనచిత్ర రంగంలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.తన నటన ఇంకా అభినయంతో  ఎన్నో వేల మంది అభిమానులను ఆమె ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్నారు. అయితే తాజాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ తన వైఫ్ తో దిగిన చివరి ఫోటోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.ఇక బోనీ కపూర్ పోస్ట్‌లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఈ ప్రొడ్యూసర్ తరచూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలని పోస్ట్  చేస్తుంటారు. ఈ సారి తన భార్య శ్రీదేవితో చివరి సారిగా దిగిన ఫోటోను బోణికపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన బంధువుల పెళ్లిలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీదేవి ఈ ఫోటోను దిగారు.


అయితే దివంగత నటి శ్రీదేవి ఫిబ్రవరి 2018 వ సంవత్సరంలో దుబాయిలో సడెన్ గా చనిపోయిన విషయం తెలిసిందే.ఇక ఈ ఫోటోలో బోణికపూర్, శ్రీదేవి ఇంకా చిన్న సోదరి ఖుషి కపూర్, బోణి కపూర్ సిస్టర్ రీనా కపూర్ లు ఉన్నారు. ఈ ఫోటోను పెళ్లిలో వీరంతా కూడా కలిసి దిగారు. తన భార్య జ్ఞాపకాలతో ఈ ఫోటోను షేర్ చేసిన బోణి కపూర్ లాస్ట్ పిక్చర్ అని పేర్కొన్నాడు. జాహ్నవి కపూర్ కూడా తన తల్లి శ్రీదేవితో దిగిన ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ఇలా పేర్కొంది. ప్రతి చోటు నేను నీ కోసం వెతుకుతున్నాను అమ్మ.. నేను నువ్వు గర్వపడేలా చేస్తాను. నేను వెళ్లే ప్రతి చోటు ఇంకా చేసే ప్రతి పని నీతోనే ముగుస్తుంది. ఇంకా ఈ పోస్ట్ కు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రెడ్ హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు. ఆయనతో పాటు మనీష్ మల్హోత్ర, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా అలాగే సమంత కూడా ఈ ఫోటోకు స్పందిస్తూ రెడ్ సింబల్ పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: