ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన మధురం అనే వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ ను సాధించడంతో చాందినీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో అవకాశాలు లభించాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం సుహాస్ హీరోగా రూపొందినటువంటి కలర్ ఫోటో అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. కలర్ ఫోటో మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత చాందినీ కి అదిరిపోయే సినిమాలలో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం చాందిని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీలో అవకాశాన్ని మేస్ చేసుకుంది. ఆ మూవీ ఏదో తెలుసుకుందాం.

రాజ్ తరుణ్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన హెబ్బా పటేల్ కు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మొదటగా ఈ మూవీలో హెబ్బా పటేల్ స్థానంలో చాందిని చౌదరి ని హీరోయిన్ గా అనుకున్నారట ... అలాగే ఈ ముద్దుగుమ్మకు కథను వినిపించగా ఇతర మూవీల ద్వారా ఈ బ్యూటీ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయినట్లు ... దానితో హెబ్బా పటేల్ కు ఈ మూవీ లో అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: