టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి బాబి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందినటు వంటి పవర్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పటికే అనేక మూవీ లకు దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందినటు వంటి వాల్తేర్ వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందినటు వంటి రావణాసుర టీజర్ గురించి స్పందించాడు.

రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర టీజర్ ను తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టీజర్ పై బాబీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... టీజర్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. మాస్ మహారాజా రవితేజ మల్టీ షేడెడ్ క్యారెక్టర్ లో సూపర్ గా చేశారు అని ... బిగ్ స్క్రీన్ పై థ్రిల్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు బాబీ పేర్కొన్నారు.  డైరెక్టర్ సుధీర్ వర్మ కి, చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ ను తెలిపారు. అను ఇమ్మాన్యుయేల్ , ఫరియా అబ్దుల్లా , మేఘా ఆకాష్, దివ్యాంశ కౌశిక్ మరియు పూజిత పొన్నాడ లు ఈ మూవీ లో లీడ్ రోల్ లలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: