పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కి కమిట్ అయ్యాడు. ఈ మూవీ తమిళం లో రూపొందినటు వంటి తేరి అనే సూపర్ హిట్ మూవీ కి రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ తమిళ సినిమా కథలో అనేక మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా దాదాపుగా కన్ఫామ్ అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు బయటికి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ లో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతుంది అని అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి.

అయితే ఈ వార్తలను చిత్ర బృందం ఖండించ లేదు ... అలా అని దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ లీల ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా నటించడం లేదు అని రెండవ హీరోయిన్ గా నటించబోతుంది అని ... మెయిన్ హీరోయిన్ గా మరో హీరోయిన్ ఉండబోతుంది అని అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం మరిbకొన్ని రోజుల్లో విడుదల చేయబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: