మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం అనే భారీ బడ్జెట్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని  3D వర్షన్ లో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక పోస్టర్ లను విడుదల చేసింది. 

పోస్టర్ లు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతbగానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సమంత కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం హ్యాపీ ఉమెన్స్ డే అంటూ శాకుంతలం మూవీ నుండి సమంత కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టల్ లో సమంత ఒంటినిండా నగలు వేసుకొని అద్భుతమైన లుక్ లో ఉంది. సమంత కు సంబంధించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: