పాన్ ఇండియా హీరో ప్రభాస్ - కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కేజిఎఫ్ సినిమా నిర్మించిన హోం బలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరణ్ గారు ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసమే భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ  సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా...

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. అయితే విడుదల కంటే ముందు ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ అని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే రిలీజ్ కంటే ముందు సలార్ కోసం భారీ ప్రమోషనల్ క్యాంపెనింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సమ్మర్ లో సినిమాకి సంబంధించిన పోస్టర్లు టీజర్ గ్లిమ్ప్స్ వీడియో ఇలా ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేస్తూనే ప్రమోషన్పై కూడా అదే సమయంలో ఫోకస్ పెట్టాడట ఈ దర్శకుడు.

సలార్ రిలీజ్ కు మూడు నెలల ముందు నుంచి ప్రభాస్ తో కలిసి మూవీ ప్రమోషన్స్ ని డైరెక్టర్ ప్లాన్ చేయబోతున్నారట. బాహుబలి కే జి ఎఫ్ ఫ్రాంచైజీలతో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరి మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో సలాడ్ సినిమాకు కూడా అదే క్రియేషన్ తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా సలార్ మూవీ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ ప్లాన్స్ కనుక వర్క్ అవుట్ అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ సలాడ్ తోపాటు ప్రాజెక్టుకి మారుతి సినిమా షూటింగ్స్ లను కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు.ప్రాజెక్టుకే షూటింగ్ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయినట్లు చెబుతున్నారు. అటు మారుతి మూవీ షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు ముస్తాబ్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: