నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తెలుగు , కన్నడ , తమిళ్ , మలయాళం , హిందీ భాషలలో ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నాని వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాని తాను నటించిన వి మరియు టక్ జగదీష్  మూవీ ల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... నాని హీరోగా రూపొందిన వి మరియు టక్ జగదీష్ మూవీ లు కరోనా సమయంలో థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో విడుదల అయినప్పటికీ ఈ మూవీ లు ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు విఫలం అయ్యాయి. అలాగే ఈ మూవీ లు థియేటర్ లలో కనుక విడుదల అయ్యి ఉంటే ఈ సినిమాలు దాదాపుగా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యేవి అని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. వీటిపై తాజాగా నాని స్పందిస్తూ ... వి మరియు టక్ జగదీష్ మూవీ లు  సక్సెస్ ఫుల్ వెంచర్లు. ఈ సినిమాలు నిర్మించిన నిర్మాతలకు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ల ద్వారా డబ్బులు వచ్చాయి. దాని ద్వారా వాళ్ళు లాభాలు పొందారు. అలాగే ఈ మూవీ ని కొనుగోలు చేసిన డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ వ్యూస్ లభించాయి. వాటి ద్వారా వాళ్లకు కూడా న్యాయం జరిగింది. అలా వి మరియు టచ్ జగదీష్ మూవీ లు రెండు కూడా సక్సెస్ ఫుల్ వెంచర్లే అని నాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: