అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను తెగ పిచ్చెక్కించింది. నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో నే గడుపుతుంది.తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా ఆమె సంపాదించుకుంది. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం కూడా అందుకుంది. అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని అందరి ఆదరణ పొందింది..

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి అయితే వెళ్ళింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆమె సంపాదించుకుంది. ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు ను కూడా సంపాదించుకుంది. ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అయితే అంతా ఇంతా కాదు. వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చినట్లు తెలుస్తుంది..ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో కూడా బాగా రెచ్చిపోయింది. ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు  కూడా ఇచ్చి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా బాగా రెచ్చిపోయింది. అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అకూడా వకాశం అందుకుంది. ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో ఆమె బాగా రచ్చ చేసింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు కూడా దారుణమైన ట్రోల్స్, కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు..అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ ను పంచుకుంది. అందులో తన తండ్రి తన కోసం మెన్షన్ హౌస్ మందు బాటిల్ పంపగా ఆ ఫోటో షేర్ చేస్తూ తన తండ్రి తనకు పంపించాడు అని అయితే మురిసిపోయింది. కానీ తన తండ్రి పంపించిన గిఫ్ట్ తన తల్లికి నచ్చలేదు అంటూ కూడ చెప్పుకొచ్చింది.దీంతో ఆ స్టోరీ చూసి అందరూ వామ్మో కూతుర్లకు ఇటువంటి గిఫ్ట్ లు కూడా ఇస్తారా అంటూ షాక్ అవుతున్నారటా.. మరికొంతమంది రకరకాలుగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా బాగా వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: