అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ వన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల అయ్యి అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలకపాత్రను పోషించింది.


నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 7 సార్లు బుల్లి తరపై ప్రసారం అయింది. అందులో ప్రతి సారి కూడా ఈ మూవీ అదిరిపోయే "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే 7 వ సారి బుల్లి తెరపై ప్రచారం అయింది. 7 వ సారి ప్రసారం అయినప్పుడు ఈ మూవీ 6 వ సారి కంటే ఎక్కువ "టి ఆర్ పి" సాధించడం విశేషం అని చెప్పాలి. 6 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించగా ... తాజాగా 7 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 5.53 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇలా 6 వ సారి కంటే ఈ మూవీ 7 వ సారి ఎక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: