టాలీవుడ్ యంగ్
హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్
మూవీ దసరా. ఈ మూవీపై
నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
దసరా సినిమా కోసం
నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు నాని.కొత్త
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ పాన్
ఇండియా సినిమాలో కీర్తిసురేష్
హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణ సింగరేణి నేపథ్యంలో ఈ
మూవీ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ
సినిమా టీజర్, ట్రైలర్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇక
న్యాచురల్ స్టార్ నాని నటనతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడని రీసెంట్ గా విడుదల అయిన ఈ
సినిమా ట్రైలర్ చూస్తే పూర్తిగా అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ
మూవీ తెరకెక్కింది. ఇంకా అలాగే
వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ అయితే ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించిందని సమాచారం తెలుస్తుంది.
ఇక డీ గ్లామర్ లుక్ లో చాలా నేచురల్ గా అనిపించింది
కీర్తి సురేష్.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టడం జరిగిందట. మొత్తం 15 నిమిషాలకు పైగా ఈ క్లైమాక్స్
ఎపిసోడ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది.భారీ సెట్టింగ్స్ లో భారీ బడ్జెట్తో ఈ క్లైమాక్స్ షూటింగ్ చేశారట.సినిమా అంతా కూడా ఒక ఎత్తైతే.. ఈ
సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు అని సమాచారం తెలుస్తుంది.ఈ
సినిమా తెలుగుతోపాటు.. తమిళ్,
కన్నడ , హిందీ, మలయాళ వంటి పాన్
ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఇక ఖచ్చితంగా ఈ
సినిమా సబ్జెక్టు పాన్-ఇండియా
ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అనే నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్.
మార్చి 30వ తేదీన ఈ
సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.చూడాలి ఈ
సినిమా హిట్ అయ్యి
నాని కూడా ప్రభాస్, అల్లు అర్జున్,
రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ లాగా పాన్
ఇండియా హిట్ కొట్టి పాన్
ఇండియా స్టార్
హీరో అవుతాడో లేడో..