టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దసరా. ఈ మూవీపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు నాని.కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇక న్యాచురల్ స్టార్ నాని నటనతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడని రీసెంట్ గా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే పూర్తిగా అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇంకా అలాగే వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ అయితే ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించిందని సమాచారం తెలుస్తుంది.


ఇక డీ గ్లామర్ లుక్ లో చాలా నేచురల్ గా అనిపించింది కీర్తి సురేష్.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టడం జరిగిందట. మొత్తం 15 నిమిషాలకు పైగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది.భారీ సెట్టింగ్స్ లో భారీ బడ్జెట్తో ఈ క్లైమాక్స్ షూటింగ్ చేశారట.సినిమా అంతా కూడా ఒక ఎత్తైతే.. ఈ సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు అని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ , హిందీ, మలయాళ వంటి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఇక ఖచ్చితంగా ఈ సినిమా సబ్జెక్టు పాన్-ఇండియా ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అనే నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్. మార్చి 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.చూడాలి ఈ సినిమా హిట్ అయ్యి నాని కూడా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాగా పాన్ ఇండియా హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ హీరో అవుతాడో లేడో..

మరింత సమాచారం తెలుసుకోండి: