ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించే సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ లు అవుతున్నాయి. అలా స్టార్ హీరోల సినిమాలకు అంతలా ఖర్చు పెట్టడానికి ప్రధాన కారణం వారి మార్కెట్ పెరగడమే. ఇది ఇలా ఉంటే స్టార్ హీరోల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోల సినిమాలు 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అలా ఈ సంవత్సరం విడుదల కాబోయే మూవీ లలో 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన మరియు రూపొందబోతున్న మూవీ లు ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి దాదాపు 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సమంత "శాకుంతలం" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. అఖిల్ నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

 ఈ మూవీ కి కూడా 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది  సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రామ్ ... బోయపాటి కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ కానున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ... సమంత కాంబినేషన్ లో ప్రస్తుతం ఖుషి మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కూడా 60 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ కానున్నట్లు సమాచారం. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా 60 కోట్లకు దాటనునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: