ఈ వారం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి అంచనాలు కలిగిన రెండు సినిమాలు థియేటర్ లలో విడుదలకు రెడీ గా ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన సెన్సార్ వివరాలను మరియు ఆ సినిమాలకు సంబంధించిన రన్ టైం వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

రావణాసుర : మాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా , దక్షా నాగర్కర్ , పూజిత పొన్నాడ , మేఘ ఆకాష్ , అను ఇమాన్యుల్ హీరోయిన్ లుగా నటించగా ... సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది.  ఈ మూవీ 141 నిమిషాల 56 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.మీటర్ : టాలీవుడ్ సూపర్ హీరో లలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీ కి రమేష్ కాడురి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదిన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 127 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: