నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించక శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు.  రెండు పాత్రలలోనూ బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. 

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలక్షన్ లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమైన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై సందడి చేయబోతోంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా తాజాగా స్టార్ మా సంస్థ ఈ మూవీ ని అతి త్వరలో స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ ద్వారా దునియా విజయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా లోని వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు గాను తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: