యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడి గా రామాయణం సినిమాలో రాముడి పాత్రలో కనిపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత యువ హీరో గా నిన్ను చూడాలని అనే మూవీ లో నటించాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యువ హీరో గా నటించిన మొట్ట మొదటి మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2001 వ సంవత్సరం ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

మూవీ కి వి ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా ... ఉషా కిరణ్ మూవీ స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఎస్ ఎం రాజశేఖర్మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీగా అలరించ లేక పోయిన ఈ సినిమాను తిరిగి ఈ సంవత్సరం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం మే 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇప్పటికే అనేక మంది తెలుగు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టాయి.  మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: