బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన మరియు ఎన్నో సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలో నటించి హిందీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సంజయ్ దత్ ఒకరు. ఇప్పటికే హిందీ సినిమాల్లో మాత్రమే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటించి సంజయ్ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితమే సంజయ్ "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ లో సంజయ్ పాత్ర అద్భుతంగా ఉండడం ... అలాగే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీ లో కూడా సంజయ్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సంజయ్ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సంజయ్ కి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ... కన్నడ హీరో ధ్రువ సర్జ హీరోగా రూపొందుతున్న కేడి అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో సంజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా బెంగళూరు మగాది రోడ్డులో జరిగిన షూట్ సెట్స్ లో సంజయ్ గాయపడినట్లు తెలుస్తోంది. సంజయ్ పై ఒక భారీ యక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన చేతలు ... ముఖం ... మోచేతులకు కొంత గాయాలు అయ్యాయట. వెంటనే అప్రమత్తమైన ఈ మూవీ యూనిట్ ఆయనని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సంజయ్ కు ఎలాంటి ప్రమాదం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: