నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించు కున్న రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కాయి .

అందులో భాగంగా రాశి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా కొంత మంది స్టార్ హీరోల సరసన కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ్ ... హిందీ సినిమాలపై కూడా చాలా ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే కార్తి హీరోగా రూపొందిన సర్దార్ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించిన రాశిమూవీ తో మంచి విజయం అందుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ లో కూడా అనేక అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ "యోధ" అనే హిందీ సినిమాలో నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా రాశి ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగ్ పనులను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాశి కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: