పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. 2024 ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేసి రాజకీయాల్లో బాగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు.దీంతో వరసగా ఓకే చేసిన సినిమాలకు డేట్స్ ఇస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. కొన్ని రోజుల క్రితమే వినోదయ సితం రీమేక్ సినిమా షూట్ ని 25 రోజులు వరుస డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్.అలాగే రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మొదలవ్వగా ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసేశాడు.తాజాగా మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న They Call Him OG సినిమా సెట్లోకి పవన్ కల్యాన్ అడుగుపెట్టాడు. సుజిత్ దర్శకత్వంలో ఇంకా DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా They Call Him OG. అప్పుడే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.


ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలవ్వగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షూట్ లో జాయిన్ అయ్యారు. సెట్ లో పవన్ ఫొటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ లుక్ సూపర్ గా అదిరిపోయింది అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ప్రియాంక అరుళ్ మోహన్ OG సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోతోంది. ఇప్పటికే తెలుగులో శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది. తమిలంలో డాక్టర్, డాన్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది ప్రియాంక మోహన్. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.ప్రియాంక కూడా షూటింగ్ లో జాయిన్ అయినట్టు సమాచారం తెలుస్తుంది.ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా డైరెక్టర్ సుజీత్ ప్రతీది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OG