
ఈ సినిమాలో బాహుబలి గా ప్రభాస్ బల్లాలదేవుడిగా రానా ఇక కీలక పాత్రల్లో అనుష్క, రమ్యకృష్ణ, తమన్న నటించారు అని చెప్పాలి. ఇక సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర అయితే బాహుబలి సినిమాకు వెన్నుముకగా నిలిచింది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా చూసిన తర్వాత కట్టప్ప పాత్రను సత్యరాజ్ తప్ప ఇంకెవరు కూడా అంతలా న్యాయం చేసేవారు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మాస్టర్ మైండ్ రాజమౌళి మాత్రం కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదించాడట.
ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. ఎలాంటి పాత్రలోనైనా సరే లీనమై పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ అయితే బాగుంటుందని రాజమౌళి అనుకున్నాడట. ఈ క్రమంలోనే సంప్రదింపులు కూడా జరిపాడట. అయితే స్క్రిప్ట్ విన్న సంజయ్ దత్ కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించాడట. దీంతో ఇక ఈ ఛాన్స్ కి నో చెప్పేసాడట. ఆ తర్వాత కట్టప్ప పాత్ర చివరికి సత్యరాజ్ కు దక్కింది. ఇక సత్యరాజ్ కెరియర్ లోనే ఈ పాత్ర ఒక మైల్ స్టోన్ గా నిలిచింది అని చెప్పాలి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ఈ విషయాన్ని వెల్లడించాడు అని చెప్పాలి. ఇక కే జి ఎఫ్ సినిమాలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటించిన సంజయ్ దత్ ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే.