బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అజయ్ దేవగన్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు . 

ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "భోళా" అనే మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది . 
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అజయ్ దేవ గన్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినటు వంటి ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు మూవీ లో కీలక పాత్ర లో నటించాడు .

మూవీ ద్వారా అజయ్ దేవగన్ తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకున్నాడు . అజయ్ దేవగన్ ... రోహిత్ కాంబినేషన్ లో ఇది వరకు సింగం 1 మరియు సింగం 2 మూవీ లు రూపొంది అద్భుతమైన విజయా లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో సింగం 3 సినిమా కూడా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం . సింగం 1 మరియు సింగం 2 సూపర్ హిట్ విజయా లను అందుకోవడంతో సింగం 3 మూవీ పై ప్రేక్ష కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: