కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ సినిమా 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ ఇంకా పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.మంచి ఊర మాస్ కథగా తెరకెక్కిన 'దసరా' సినిమాకు నైజాం ఏరియాలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఇంకా ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల  బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. ఇంకా కర్నాకటలో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు ఇంకా ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్‌ ని ఈ సినిమా జరుపుకుంది. ఇక ఈ సినిమాకి మిగిలిన భాషల్లో ఏమో కానీ సొంత ఏరియాలు అయిన ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.


ఫలితంగా అందుకు తగ్గట్టు భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే IPL కారణంగా 3వ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోవడం జరిగింది. కానీ 23వ రోజు 8 లక్షలు రాబట్టిన ఈ సినిమా 24వ రోజు రూ. 12 లక్షలు కలెక్ట్ చేసింది.ఈ సినిమా నైజాంలో రూ. 26.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.47 కోట్లు ఇంకా ఈస్ట్ గోదావరిలో రూ. 2.28 కోట్లు అలాగే వెస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, గుంటూరులో రూ. 2.49 కోట్లు, కృష్ణాలో రూ. 2.17 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలు ఇంకా మొత్తం కలిపి.. రూ. 45.00 కోట్లు షేర్ ఇంకా రూ. 76.10 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 63.86 కోట్లు షేర్‌, రూ. 115.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది.ఫైనల్ గా ఈ సినిమా నిర్మాతలకు రూ. 14.86 కోట్లు లాభాల రావడంతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: