మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటి దాకా ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొదటి రోజు రూ.4.79 కోట్లు, రెండో రోజు రూ.5.80 కోట్లు మూడో రోజు,  రూ.5.77 కోట్లు ఇంకా నాలుగో రోజు రూ.3.01 కోట్లు అలాగే ఐదో రోజు రూ.2.40 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తం ఐదు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా ఏకంగా రూ.21.77 కోట్ల రూపాయలను ఇంకా 37.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఐదో రోజు అటు ఏపీ ఇటు తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ.2.40 కోట్లు రూ.4.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో రూ.1.04 కోట్లు, సీడెడ్ లో రూ.34 లక్షలు అలాగే యూఏలో రూ.33 లక్షలు తూర్పు రూ.19 లక్షలు ఇంకా పశ్చిమ రూ.11 లక్షలు గుంటూరు రూ.14 లక్షలు కృష్ణ రూ.15 లక్షలు అలాగే నెల్లూరు రూ.7 లక్షలు వసూలు చేసింది.


ఇంకా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో విరూపాక్ష ఏ రేంజ్ లో వసూళ్లు సాధించిందంటే.. నైజాం ఏరియాలో రూ.9.56 కోట్లు సీడెడ్ లో రూ.3.16 కోట్లు యూఏలో రూ.2.78 కోట్లు తూర్పు రూ.1.51 కోట్లు పశ్చిమ రూ.1.08 కోట్లు గుంటూరు రూ.1.52 కోట్లు కృష్ణ రూ.1.44 కోట్లు నెల్లూరు రూ.72 లక్షల వసూళ్ళని రాబట్టింది. ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.21.77 కోట్లు షేర్ రూ.37.25 గ్రాస్ వసూళ్లను సాధించింది.కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.1.95 కోట్లు ఓవర్సీస్ లో రూ.4 కోట్లు రాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.27.67 కోట్లు షేర్ దాదాపు రూ.50 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా మొత్తం  బిజినెస్ 22.20 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ అయితే 23 కోట్లకు ఫిక్స్ అయింది.అయితే ఇప్పటికే విరూపాక్ష సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.27.67 కోట్లను రాబట్టుకొని 4.67 కోట్ల లాభాన్ని చేకూర్చుంది. మరంత లాభాలతో ఇంకా ముందుకు దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ సినిమా సక్సెస్ వల్ల ఇప్పుడు మారుతీకి పెద్ద పని పడింది. ప్రభాస్ తో చేసే రాజా డీలక్స్ సినిమా కూడా హార్రర్ నేపథ్యంలో రావడంతో మారుతీపై రెబల్ ఫ్యాన్స్ ఒత్తిడి పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: