సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఓ సినిమా కోసం చాలా కష్టపడుతుంటారు.అలా ఒక్కోసారి అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటారు. అలా ఎంతగానో కష్టపడ్డ ఆ సినిమా విడుదలయ్యాక మంచి విజయం అందుకోగానే.. ఆ ఆనందం ముందు వాళ్లు పడ్డ కష్టమంతా మర్చిపోతూ ఉంటారు. తాజాగా సినిమా కోసం అంతలా కష్టపడి ఆనందం కోసం ఎదురు చూస్తున్నాడు మన అల్లరి నరేష్. ఈ హీరో తాజాగా నటించిన మూవీ 'ఉగ్రం'. నాంది సేమ్ విజయ్ కనకమెడల తెరకెక్కించిన ఈ సినిమా కోసం అల్లరి నరేష్ ఏకంగా రోజుకి 100 సిగరెట్లకి పైగా తాగాడట. సినిమాలో ఓ పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు ఈ హీరో. 

ఇండస్ట్రీకి కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్.. ఈ మధ్యకాలంలోనే సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. తాజాగా ఉగ్రం సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ రోల్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నరేష్ ఆరోగ్యం కూడా పాడైందట. దగ్గుతో అతను చాలా బాధపడ్డాడట. విపరీతంగా సిగరెట్స్ కాల్చడమే అందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగానే సిగరెట్స్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది. అలాంటిది అల్లరి నరేష్ మాత్రం నాలుగు రోజుల్లో 500 సిగరెట్స్ తాగాడట. అంటే రోజుకి 100 సిగరెట్లకు పైగా అన్నమాట. ఉగ్రం సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసమే ఈ సిగరెట్లను తాగాడట నరేష్. రాత్రి సమయంలో షూట్ చేసిన ఆ ఫైట్ లో నరేష్ సిగరెట్ల ను కాలుస్తూ కనిపించాలట.

అయితే ఈ ఫైట్ సీన్ ను నాలుగు రోజులు షూట్ చేశారట. దీంతో నాలుగు రోజులు నరేష్ సిగరెట్స్ కాలుస్తూ నటించాడట. అలా ఆ ఫైట్ సీన్ పూర్తయ్యలోపు దాదాపు 500 సిగరెట్లు తాగేసాడట ఈ హీరో. ఇక ఆ తర్వాత రోజు నుంచి నరేష్ దగ్గుతో బాధపడుతూనే షూటింగ్ కి వచ్చాడట. అలా ఉగ్రం మూవీలో ఓ ఫైట్ సీన్ కోసమే అంతలా కష్టపడ్డ అల్లరి నరేష్ కి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్ణ హీరోయిన్ గా నటించగా.. మొదటిసారి నరేష్ ఈ సినిమాలో పవర్ఫుల్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోగా.. మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: