ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకుంది. 2016 లో విడుదలైన ఈ సినిమా అటు తమిళ ఇటు తెలుగు ఆడియోస్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. 'బిచ్చగాడు 2' అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాలవల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి చిత్ర యూనిట్ ఆసక్తికర అప్డేట్ ను రిలీజ్ చేసింది. బిచ్చగాడు 2 మూవీ ట్రైలర్ తో పాటు విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించింది మూవీ యూనిట్. బిచ్చగాడు 2 ట్రైలర్ను ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. అలాగే సినిమాని వేసవి కానుకగా మే 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇదే తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక బిచ్చగాడు సీక్వెల్ ని మొదట మెట్రో, భారం లాంటి సూపర్ హిట్స్ అందించిన ప్రియా కృష్ణ స్వామి డైరెక్ట్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

దీంతో విజయ్ ఆంటోనీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.అంతేకాదు విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై అతనే స్వయంగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక బిచ్చగాడు మొదటి భాగంలో కన్నతల్లి ఆరోగ్యం కోసం ఓ స్వామీజీ సలహాతో వ్యాపారవేత్తగా ఉన్న హీరో బిచ్చగాడుగా మారుతాడు. 40 రోజులపాటు బిక్షం ఎత్తుకొని దీక్ష చేసి తన తల్లి ప్రాణాలను కాపాడుకుంటాడు. అయితే ఈసారి బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోని గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఒక గ్యాంగ్ స్టార్ బిచ్చగాడుగా ఎందుకు మారాడు అన్నదే ఈ సినిమా కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: