ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ఇండియన్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ హీరో బిచ్చగాడు అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో విజయ్ అంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని మే 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: