చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ మూవీ కి  మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.85 కోట్ల షేర్ ... 59.12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.40 కోట్ల షేర్ ... 50.48 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 53.25 కోట్ల షేర్ ... 109.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్  టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బడిలోకి దిగింది. ఈ సినిమా మరో 118.75 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: