ఆదిపురుష్ విడుదల కు సమయం అయితే దగ్గర పడింది. మరో నెలన్నర సమయం అయితే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ వరుసగా విడుదల చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ మేకర్స్ టైం ఫిక్స్ చేశారని సమాచారం.మే 9 న ఆదిపురుష్ ట్రైలర్ భారీగా లాంచ్ చేయనున్నారట. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారని తెలుస్తుంది.ఆదిపురుష్ ట్రైలర్ నిడివి మూడు నిమిషాలు పైన ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ ను కట్ చేశారట. ట్రైలర్ చూసిన ప్రభాస్ పూర్తి సంతృప్తి ని వ్యక్తం చేశారట. 

ఇప్పటి వరకు ఆదిపురుష్ చిత్రం మీదున్న నెగిటివిటీ మొత్తం దూరం చేసేదిగా ట్రైలర్ ఉండనుందని తెలుస్తుంది.. ట్రైలర్ చూశాక యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సమాచారం.ఈ మేరకు ట్రైలర్ లాంచ్ కి ప్రత్యేకమై న ప్రదేశం ఎంచుకునే అవకాశం కలదు. ఇది సెంటిమెంట్స్ తో కూడిన చిత్రం కావడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ కూడా భావిస్తున్నారట. 

కాగా ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది . ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. యాంటీ ఫ్యాన్స్కూడా ట్రోల్ చేశారు. హిందువర్గాలు కొన్ని అంశాలను కూడా వ్యతిరేకించాయి. టీజర్లో పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా కొందరు విమర్శలు చేశారు. ముఖ్యంగా రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ ని వారు తప్పుబట్టారు. రావణాసురుడు శివ భక్తుడు. ఆయన రూపం గురించి రామాయణంలో రాసి అయితే ఉంది. మీకు ఇష్టం వచ్చినట్లు పురాణ పాత్రలను చూపిస్తారా అని కూడా మండిపడ్డారు. 

ఆదిపురుష్ మూవీ ఆరు నెలలు వెనక్కిపోవడానికి కూడా కారణం ఇదేనని తెలుస్తుంది.. నిజానికి 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అయితే భావించారు. అధికారిక ప్రకటన తర్వాత సినిమాను వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: