కోలీవుడ్ లెజెండరి సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ సినిమా మొదటి భాగం గత సంవత్సరం విడుదలై రూ.500 కోట్ల క్లబ్లో చేరి మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా తెలుగు భాష ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ , త్రిష, ప్రకాష్ రాజ్ , విక్రమ్ చియాన్ , జయం రవి ఇంకా అలాగే కార్తీ వంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించిన ప్రతి నటీనటులకి కూడా చాలా మంచి గుర్తింపు లభించింది.ఇకపోతే మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రెండో భాగం కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 28 వ తేదీన PS -2 సినిమాని కూడా విడుదల చేశారు. అయితే ఈసారి తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా నిజంగా ఊహించని విధంగా ఆకట్టుకుందనే చెప్పాలి . మొదటి షో తోనే శభాష్ అనిపించుకున్నారు లెజెండరి డైరెక్టర్ మణిరత్నం.


మొన్నటి దాకా మణిరత్నం సినిమాల్లో మ్యూజిక్ తగ్గింది అనే కామెంట్ వినిపించేది . కానీ ఆ కామెంట్ ను ఇప్పుడు ఒక్క సినిమాతో పక్కకు పోయేలా పిఎస్ -2 తో చేసేసారు లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం.రాజమౌళి సినిమాల లాగే సౌత్ ఇండియా పవర్ ఏంటో అందరికీ తెలిసేలా PS -2 సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతోంది .ఇక తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా మార్చి షూట్ చేసిన మణిరత్నం.. మొదటి పార్ట్ కు కొనసాగింపుగా రెండవ పార్ట్ ను కూడా విడుదల చేశారు. త్రూ అవుట్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ డూపర్ టాక్ తో చాలా స్పీడ్ గా దూసుకుపోతోంది. ఇంకా అంతేకాదు కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 200 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే నార్త్ అమెరికాలో కూడా ఏకంగా 3 మిలియన్ డాలర్లు పైగా ఈ సినిమా వసూలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ps2