పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో "ఓజి" మూవీ ఒకటి. ఈ మూవీ కి రన్ రాజా రన్ ... సాహో మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ ... పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... ప్రకాష్ రాజ్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ముంబై లో ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ మరియు ప్రియాంక పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

మూవీ లో పవన్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్రలోనూ ... యంగ్ పాత్రలోనూ ... ఆ తర్వాత డాన్ పాత్రలోను కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పాత్రలలోనూ పవన్ మూడు అదిరిపోయే వేరియేషన్స్ ను కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత పవన్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: